ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానం: SI

ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానం: SI

BHPL: రేగొండ మండలంలోని కనపర్తి గ్రామంలో ఎస్సై డి. సుధాకర్ ఆధ్వర్యంలో గ్రామ భద్రత పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం SI మాట్లాడుతూ.. ఒక కెమెరా వందమంది పోలీసులకు సమానంగా పనిచేస్తుందని తెలిపారు. నేరాల నివారణకు కెమెరాలు కీలకమని పేర్కొంటూ గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. సర్పంచ్ తదితరులు ఉన్నారు.