'హిందువులను బీజేపీ ప్రభుత్వం దోచుకుంటుంది'

'హిందువులను బీజేపీ ప్రభుత్వం దోచుకుంటుంది'

HYD: ఆలయాల సేవలు, ప్రసాదాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ ఆరోపించారు. దీనివల్ల ఆలయ సేవల రేట్లు, ప్రసాదాల ధరలు పెరుగుతాయని, ఇది హిందువులను బీజేపీ ప్రభుత్వం దోచుకోవడమే అని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాలపై ఉన్న వ్యాట్‌ను ఎత్తివేసిందని, ఎవరు హిందువులకు లాభం చేస్తున్నారో ప్రజలు గమనించాలని కోరారు.