డీజేలకు అనుమతి లేదు: ఎస్పీ

NRPT: గణేష్ ఉత్సవాలు, ఇతర మత పరమైన పండగల సందర్భంగా జిల్లా పరిధిలో డీజేలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఉత్సవ కమిటీ సభ్యులకు తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, హిందూ మత పెద్దలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించడానికి అందరూ సహకరించాలని ఆయన అన్నారు.