'బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలి'

JN: చిల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గంటే ఉపేందర్ యాదవ్ పాల్గొన్నారు.