33 ఏళ్ల తరువాత కలుసుకున్న ఫ్రెండ్స్

33 ఏళ్ల తరువాత కలుసుకున్న ఫ్రెండ్స్

ASR: జీకేవీధి మండలం సీలేరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1991-92 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 40మంది వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా 33ఏళ్ల తరువాత కలుసుకుని ఒకరి క్షేమాలు ఒకరు అడిగి తెలుసుకున్నారు. బాల్యం నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుని సరదాగా గడిపారు. సైన్స్ టీచర్‌గా పాఠశాలలో పని చేసిన సత్యనారాయణ మాస్టారును సన్మానించారు.