జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు
SKLM: పొందూరు మండలం వావిలపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థులు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి వృత్తివిద్యా, నైపుణ్య ప్రతిభ సదస్సులో సత్తా చాటారు. ఈ మేరకు జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందారు. విద్యార్థులు హిమ వర్ష, సింధు, మృదులను ప్రిన్సిపల్ ప్రభాకర్‌తోపాటు అధికారులు శనివారం అభినందించారు.