జిల్లాలో పింఛన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

ATP: జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను రేపు పంపిణీ చేయనున్నారు. మే నెల పింఛన్లకు సంబంధించి జిల్లాలోని 2,80,999 మందికి రూ.124.95 కోట్లు మంజూరైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి పింఛన్ పంపిణీ చేసేందుకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. లబ్ధిదారులకు ఇంటి వద్దనే పింఛన్ సొమ్మును అందజేయనున్నారు.