చింతపల్లి లో 4 సర్పంచ్‌లు ఏకగ్రీవం
NLG: చింతపల్లి మండలంలో గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 36 గ్రామ పంచాయతీలకు గాను, 4 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు. దీంతో, మిగిలిన స్థానాలకు మొత్తం 88 మంది సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మిగిలిన స్థానాల్లో పోటీ రసవత్తరంగా సాగనుంది.