మహిళలు ఆర్థికంగా ఎదగాలి: కలికిరి

చిత్తూరు: మహిళలు ఆర్థికంగా ఎదగడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ స్పష్టం చేశారు. సోమవారం యాదమరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.