ధాన్యం వ్యాపారిపై కేసు నమోదు

GNTR: పంట కొనుగోలు చేసిన వ్యాపారి నగదు చెల్లించలేదని, తమకు న్యాయం చేయాలంటూ బాధిత రైతులు దుగ్గిరాల పోలీస్ స్టేషన్‌లో బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఈమని గ్రామానికి చెందిన వ్యాపారి లక్ష్మణ్ కుమార్ తమ ధాన్యం, జొన్న పంటలను కొనుగోలు చేసి నెలరోజులైనా నగదు చెల్లించడం లేదన్నారు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై రవి తెలిపారు.