ఇంటర్ తెలుగు స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ
కోనసీమ: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తెలుగు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అమలాపురంకి చెందిన తెలుగు లెక్చరర్ నల్ల నరసింహమూర్తి స్టడీ మెటీరియల్ రూపొందించారు. ఈ మెటీరియల్‌ను ప్రిన్సిపల్ నాగేశ్వరరావు శుక్రవారం అమలాపురంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో తెలుగు మెటీరియల్ అందించారన్నారు.