'42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి'
SRPT: 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. ఈరోజు సూర్యాపేటలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చి బీసీలకు న్యాయం చేయాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు తెలిపారు.