ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

KRNL: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఏ.సిరి ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆమె స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువలిటీ, ఎమర్జెన్సీ వార్డులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల విధానం, ఆసుపత్రిలోని శుభ్రత వంటి అంశాలను ఆమె పరిశీలించి రోగులకు సమయానికి చికిత్స అందించాలని వైద్యులను కోరారు.