యువతకు వివేకానందుడే స్ఫూర్తి: కలెక్టర్ తేజస్

యువతకు వివేకానందుడే స్ఫూర్తి: కలెక్టర్ తేజస్

SRPT: నేటి యువత స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకుని ఆశయ సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జరిగిన వివేకానంద జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, వివేకానందుడి బోధనలు పాటించాలని సూచించారు.