రైతు బీమాపై సర్కార్ నాటకం: నిరంజన్ రెడ్డి
WNP: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బీమాను ఎగ్గొట్టేందుకు కుట్ర చేస్తోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్‌లో అందరికీ రూ.5 లక్షల జీవిత బీమా అని ప్రకటించి, సాయంత్రానికి కేవలం రేషన్ కార్డు ఉన్నవారికేనని మాట మార్చారని మండిపడ్డారు. ప్రభుత్వం చెప్పినట్లు కోటి 15 లక్షల కుటుంబాలకు ప్రీమియం కట్టి బీమా వర్తింపజేస్తుందా అని ఆయన ప్రశ్నించారు.