తప్పులు లేని ఓటరు జాబితాకు సహకరించాలి

VZM: తప్పులు లేని ఓటరు జాబితాకు రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలని గజపతినగరం నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి ప్రమీలాగాంధీ కోరారు. మంగళవారం గజపతినగరంలోని తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటర్‌కు ఒక్క దగ్గర మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు.