డాన్‌బాస్ ప్రాంతానికి విముక్తి కల్పిస్తాం: పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద డాన్‌బాస్ ప్రాంతానికి ఉక్రెయిన్ దళాల నుంచి విముక్తి కల్పిస్తానని పుతిన్ వెల్లడించారు. సైనిక చర్య ద్వారానైనా లేక దౌత్యపరంగానైనా విముక్తి చేయనున్నట్లు తెలిపారు. వాస్తవానికి ఆ ప్రాంతంలో అంతగా యుద్ధం జరగాల్సిన అవసరం లేదన్నారు. అక్కడి ప్రజలు ఉక్రెయిన్‌తో కలిసి ఉండేందుకు ఇష్టం పడటం లేదని చెప్పారు.