మలేరియా దినోత్సవ గోడ పత్రికలను ఆవిష్కరించిన కలెక్టర్
VZM: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి ప్రపంచ మలేరియా దినోత్సవం గోడ పత్రికలను ఆవిష్కరించారు. ప్రజల్లోప్రతీ ఒక్కరికి మలేరియా వ్యాధిపై అవగాహన ఉండాలని, అదే విధంగా మే 1 నుంచి జిల్లాలో జరగబోయే స్ప్రే కార్యక్రమం, హైరిస్క్ గ్రామాలను గుర్తించి, ఐఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.