VIDEO: భర్త ఇంటి ముందు నిరసనకు దిగిన భార్య
RR: భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగిన ఘటన హయత్ నగర్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం.. గతేడాది మౌనికకు నిఖిల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు నిఖిల్ నమ్మించి, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే గతవారం ఇంట్లో నుంచి నిఖిల్ వెళ్లిపోయాడు. చివరకు తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. అత్తింటి ముందు ఆందోళనకు దిగింది.