ఓబీసీ విద్యార్థి జిల్లా అధ్యక్షులుగా వెంకట్ యాదవ్

ఓబీసీ విద్యార్థి జిల్లా అధ్యక్షులుగా వెంకట్ యాదవ్

CTR: ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా చౌడేపల్లికి చెందిన వెంకట్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్‌లో జాతీయ అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వరరావు నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ... బీసీల విద్యార్థుల సంక్షేమం, అభివృద్ధి కొరకు కృషి చేయాలని సూచించారు.