మెరుగైన వైద్య సేవలు అందించాలి: ఎమ్మెల్యే
NDL: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. డోన్ మండలం చిన్న మల్కాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, సౌకర్యాల లభ్యత వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.