భీమేశ్వరస్వామిని దర్శించుకున్న సినీ నటి

భీమేశ్వరస్వామిని దర్శించుకున్న సినీ నటి

SRCL: వేములవాడలోని ప్రసిద్ధ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో సినీ హీరోయిన్ అనన్య నాగళ్ల శనివారం దర్శనం చేసుకున్నారు. ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేశారు.