ఉగ్రవాదం అంతం కావాల్సిందే: KCR

TG: ఆపరేషన్ సింధూర్‌పై మాజీ సీఎం KCR స్పందించారు. 'భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి నేను గర్వపడుతున్నాను. ఉగ్రవాదం అంతం కావాల్సిందే. ఇందుకోసం ప్రపంచ శక్తులన్నీ ఏకమైతే శాంతి నెలకొంటుంది. ఇండియన్ ఆర్మీ ఎంత వీరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా ఉండి దేశ రక్షణలో తాము ఎవరికీ తీసిపోము అన్నట్టుగా వారికి శక్తి సామర్థ్యాలుండాలని ప్రార్థిస్తున్నాను' అని అన్నారు.