లెబనాన్.. కీలక నివేదిక విడుదల
లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది. గత రెండు రోజులుగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 40 మంది మరణించగా.. 246 మందికి పైగా గాయపడ్డారని తెలిపింది. దక్షిణ లెబనాన్‌తో పాటు బీరూట్‌లోని నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ముఖ్యంగా హిజ్బుల్లాకు చెందిన ఆయుధ నిల్వలు, కమ్యూనికేషన్ కేంద్రాలపై దాడులు జరుగుతున్నాయి.