విద్యార్థులు గంజాయికి దూరంగా ఉండాలి: ACP
MNCL: కిష్టంపేట్ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ నిర్ములనపై కళాశాల, పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు, కిష్టంపేట్, ఎల్లక్కపేట, లింగంపల్లి గ్రామ యువకులకు చెన్నూర్ పట్టణ పోలీసులు ఈరోజు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యార్థులు గంజాయికి దూరంగా ఉండాలని, గంజాయి తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.