మత్స్యకారులతో పవన్ కళ్యాణ్ భేటీ
AP: ఉప్పాడ మత్స్యకారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉప్పాడ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. సముద్ర జలాల కలుషితంపై శాస్త్రీయ పరిశోధన చేయిస్తామని తెలిపారు. మత్స్యకారులకు అదనపు ఆదాయం తెచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. మత్స్యకారులకు ఉపాధి కల్పన లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని చెప్పారు.