కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే

కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సోమవారం కలెక్టర్ రాజాబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గిద్దలూరులో అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.