ప్రశాంతంగా జీజీ కళాశాలలో మొదటి సెమిస్టర్ డిగ్రీ పరీక్షలు
NZB: జీజీ కళాశాలలో ప్రారంభమైన మొదటి సెమిస్టర్ డిగ్రీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా జరిగాయి. పరీక్షలకు మొత్తం 1,664 విద్యార్థులకు గాను 57 మంది గైర్హాజరు కాగా, 1,607 మంది విద్యార్థులు సెకండ్ లాంగ్వేజ్ (తెలుగు,హిందీ తదితర) పరీక్షలకు హాజరయ్యారు. ఈ విషయాన్ని పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, అకాడమిక్ కో-ఆర్డినేటర్ నహీద బేగం తెలిపారు.