సొంత ఖర్చుతో గుంతలను పూడ్చిన బైక్ మెకానిక్
MHBD: చిన్నగూడూరు మండల కేంద్రంలో రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గమనించిన బైక్ మెకానిక్ సాయి తన సొంత ఖర్చుతో రోడ్డుపై ఏర్పడిన గుంతలను ట్రాక్టర్ ద్వారా మట్టి, రాళ్లను తెప్పించి పూడ్చాడు. సాయి చూపిన సేవను మండల ప్రజలు ప్రశంసిస్తున్నారు.