బిల్డర్ నిర్లక్ష్యం.. బాలుడు మృతి
MDCL: దుండిగల్ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బౌరంపేట్‌లో నిర్మాణంలో ఉన్న భవనం గేటు ప్రమాదవశాత్తు మీద పడి దుంపల ఆకాష్ (7) అనే బాలుడు మృతి చెందాడు. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న అమ్మమ్మ, తాతల దగ్గరకు వచ్చిన బాలుడు ఉదయం ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. బిల్డర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు.