లెంకలగడ్డలో ఉచిత స్వెటర్ల పంపిణీ

లెంకలగడ్డలో ఉచిత స్వెటర్ల పంపిణీ

BHPL: పలిమెల మండలం లెంకలగడ్డ గ్రామంలో గోదావరి ఒడ్డున, దట్టమైన అడవుల మధ్య చలికాలంలో కష్టాలు ఎదుర్కొంటున్న నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగులకు ఇవాళ చెన్నూరి వెంకటస్వామి, ఆయన సోదరులు రాజేందర్, సుధాకర్ ఉచితంగా స్వెటర్లు పంపిణీ చేశారు. మానవతా దృక్పథంతో స్పందించిన ఈ ముగ్గురు సోదరులు గ్రామంలోని పలువురి చలి బాధను తగ్గించేందుకు ఈ సేవా కార్యక్రమం చేపట్టారు.