శ్రీవారిని దర్శించుకున్న మున్సిపల్ ఛైర్‌పర్సన్
ADB: తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ బండారి అనూష గురువారం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు అనూష పేర్కొన్నారు.