చెత్త కుప్పకి నిప్పు.. వెదజల్లుతున్న విష వాయువులు

చెత్త కుప్పకి నిప్పు.. వెదజల్లుతున్న విష వాయువులు

ATP: రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ వద్ద చెత్త డంపింగ్ యార్డ్‌లో చెత్తకు నిప్పు అంటుకుంది. దీంతో విషవాయువులు పెద్ద ఎత్తున వెదజల్లుతున్నాయి. ఆ కాలుష్యమైన గాలిని పీల్చుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలోనూ అనేకమార్లు చెత్తకు నిప్పు అంటుకొని విషవాయువులు వెదజల్లడంతో ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యామని వాపోతున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.