పెండింగ్ ఫీజు బకాయిలు చెల్లించండి: PDSU
KKD:పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని PDSU డిమాండ్ చేసింది. విద్యార్థుల సమస్యలపై రూపొందించిన కరపత్రాన్ని గురువారం పిఠాపురంలో ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని PDSU రాష్ట్ర కార్యదర్శి సతీశ్ విమర్శించారు. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.