రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

కోనసీమ: కాట్రేనికోన మండలం వేట్లపాలెం వెళ్లే రోడ్డులో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి, ఐదేళ్ల చిన్నారి గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బైక్ పై వేగంగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.