విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలకు ఆహ్వానం

WNP: ఈనెల 17వ తేదీన వనపర్తిలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని ఈరోజు ఆయన నివాసంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. మహోత్సవాలకు హాజరు కావాలని మాజీ మంత్రికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన చారి, గన్నోజ్ మోహన్, చెన్నయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.