అక్రమ కేసులకు 10 రెట్లు తిరిగి చెల్లిస్తాం: నల్లపురెడ్డి
NLR: కొడవలూరు మండలంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ మంత్రి, మాజీ కోవూరు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆదివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమపై అక్రమ కేసులు పెడుతున్నారని, దీనికి పది రెట్లు తిరిగి చెల్లిస్తామని ఆయన అన్నారు.