జిల్లా కలెక్టరేట్‌లో రేపటి పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు
VSP: మొంథా తుఫాను హెచ్చరికల నేపధ్యంలో సోమవారం విశాఖ కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. మొంథా తుఫాను ముందస్తు చర్యలు చేపట్టే కార్యక్రమంలో భాగంగా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.