‘పెద్ది’ బ్యాట్‌తో IPLలో తిలక్ వర్మ..!
రామ్ చరణ్ తన ‘పెద్ది’ చిత్రంలో ఉపయోగించిన క్రికెట్ బ్యాట్‌ను తిలక్ వర్మకు ఇటీవలే బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యాట్ గురించి MI ప్లేయర్ సూర్యకుమార్‌కు తిలక్ వివరిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను జాన్వీ కపూర్ తన SM ఖాతాలో పోస్ట్ చేస్తూ.. రాబోయే IPLలో తిలక్ ఇదే బ్యాట్‌తో బరిలోకి దిగబోతున్నాడంటూ సరదాగా వ్యాఖ్యానించింది.