నేడు కడపలో మంత్రి సవిత పర్యటన
జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఎస్. సవిత నేడు కడపకు రానున్నారు. ఉదయం 9 గంటలకు పెనుకొండ నుంచి బయలుదేరి కడపకు చేరుకోనున్నారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుని నేతలను కలుసుకుంటారు. ఉదయం 10 గంటలకు ఒంటిమిట్టలో సమన్వయ సమావేశంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కలెక్టరేట్‌లో పీ-4 కార్యక్రమంలో పాల్గొంటారు.