'CM సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్'

'CM సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్'

ADB: ఈ నెల 4న రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో కొనసాగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించి ఏర్పాటను పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.