హన్మకొండ పీఎస్ నుంచి ముగ్గురు నిందితులు పరారీ

హన్మకొండ పీఎస్ నుంచి ముగ్గురు నిందితులు పరారీ

HNK: హాశిష్ ఆయిల్ కొనుగోలు కోసం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులను హనుమకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించగా సోమవారం వారిలో ముగ్గురు స్టేషన్ వెనుక ద్వారం నుంచి పరారయ్యారు. రాత్రి డ్యూటీలో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.