శ్రీనివాస్ మృతికి పలువురు నేతల నివాళి

శ్రీనివాస్ మృతికి పలువురు నేతల నివాళి

BDK: కొత్తగూడెం సన్యాసి బస్తీ నివాసి, కోర్టు గుమస్తాగా ఎన్నో సంవత్సరాల పాటు నిబద్ధతతో సేవలందించిన దాసరి శ్రీనివాస్ ఇవాళ అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలియగానే దాసరి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి, విషాదంలో మునిగిపోయారు. శ్రీనివాస్ మృతికి సంతాపంగా దాసరి కుటుంబ సభ్యులు అందరూ కలసి ఆయనకు ఘన నివాళులర్పించారు.