ఇసుక టిప్పర్లను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే
NRPT: అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం 11 గంటలకు అడ్డుకున్నారు. పెద్దవాగు నుంచి ఇసుక రవాణా చేయడానికి ఎలాంటి అనుమతులు లేకుండానే జాతీయ రహదారి బ్రిడ్జి పక్కన పట్టపగలు జేసీబీలతో టిప్పర్లలో ఇసుక నింపుతున్నారు. ఇసుక రవాణా చేసేందుకు కలెక్టర్ కార్యాలయం నుంచి ఎలాంటి అనుమతులు జారీ కాలేదని ఆయన తెలిపారు.