'ఎండల పట్ల అప్రమంతంగా ఉండాలి'

'ఎండల పట్ల అప్రమంతంగా ఉండాలి'

SRCL: ఎండలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఎండలు, వడగాలులతో జరిగే ప్రమాదాలు పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవికాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయని అన్నారు.