INSPIRATION: రాజా రావు
రాజా రావు.. భారతీయ ఆంగ్ల రచయిత. ఇండో-ఆంగ్ల సాహిత్యంలో త్రిమూర్తులలో ఒకరిగా ఈయన గుర్తింపు పొందారు. 'కాంతాపుర' పేరిట గ్రామీణ భారతదేశంలోని సామాజిక- రాజకీయ అంశాలను మేలవిస్తూ తన తొలి నవలను రచించారు. ఆయన రాసిన 'ది సెర్పెంట్ అండ్ ది రోప్' నవలకు 1964లో సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. భారతీయ సాహిత్యానికి చేసిన సేవలకు గాను 1969లో పద్మభూషణ్ అవార్డు వరించింది.