కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ, 14వ డివిజన్లకు చెందిన 39 మంది లబ్ధిదారులకు  వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు  కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం రూ. 39 లక్షలు విలువైన చెక్కులను ఇవాళ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.