ప్రపంచ నీటి దినోత్సవంపై అవగాహన
KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం రైతు వేదికలో భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవంపై రైతులకు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DAO భాగ్యలక్ష్మి హాజరయ్యారు. ప్రాణకోటికి మూలాధారం నీరు అని, నీరు లేకపోతే గృహ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు స్తంభించిపోతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.