మిర్చి బస్తాలు దగ్ధం.. రూ.2 లక్షల నష్టం

మిర్చి బస్తాలు దగ్ధం.. రూ.2 లక్షల నష్టం

ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామ శివారులో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మొక్కజొన్న చేనుకు నిప్పు అంటుకోవడంతో మంటలు వ్యాపించి పక్కనే లాటుగా వేసి ఉంచిన సుమారు 58 మిర్చి బస్తాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో దాదాపు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని రైతు నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.