యువకుడు దారుణ హత్య

యువకుడు దారుణ హత్య

JGL: జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట శివారులో ఆదివారం రాత్రి యువకుడి హత్య కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాలకు చెందిన యువకుడు నహీముద్దీన్ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.